కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు

By Ravi
On
కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ లో గందరగోళం నెలకొంది. అధికారులను మహిళలు నిలదీశారు. లిస్టులో నిరుపేదలకేజ్ కాకుండా 70% పైగా అనర్హులకు, కాంగ్రెస్ నాయకుల పేర్లు లిస్టులో ఉండటాన్ని చూసి మహిళలు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులను, అధికారులను నిలదీశారు. దీంతో కొద్దిసేపు అక్కడ అధికారులకు ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం పలువురు యువకులు, మహిళలు మాట్లాడుతూ పూర్తిగా ఇల్లు లేకుండా అద్దె ఇండ్లల్లో ఉంటున్న వారిని వదిలేసి Screenshot_20250510_180334_WhatsAppకాంగ్రెస్ లీడర్ పేర్లను చేర్చడంపై మండిపడ్డారు. ప్రభుత్వం ఒకపక్క ఇల్లులేని పేదలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని చెప్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అవేమి పట్టవన్నట్టుగా వ్యవహరించారని ఆరోపించారు.  స్థానిక ఎమ్మెల్యే కల్పించుకొని రీసర్వే చేయించి నిజమైన లబ్ధిదారులకు కేటాయించాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:

Advertisement

Latest News