ఉప్పల్ లో గంజాయి గోదాం.. ఎక్సైజ్ అధికారుల దాడి
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ తన దూకుడు చూపించింది. ఉప్పల్ మల్లాపూర్ హెచ్సీఎల్ ప్రాంతంలోని ఓ గోదాంలో 106 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ రూ. 53 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. డీటీఎఫ్, ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి గోదాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఒడిశా రాష్ట్రం నుంచి కారులో గంజాయి తరలించారని వెల్లడించారు. వారి సమక్షంలో గోదాంలో తనిఖీ చేసిన అధికారులు 2 కిలోల చొప్పున 56 ప్యాకెట్లు, 1 కిలోల చొప్పున 6 ప్యాకెట్లు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి అదనపు ఎక్సైజ్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ నేతృత్వం వహించారు. మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, ఏఈఎస్ ముకుందరెడ్డి, ఉప్పల్ ఎస్హెచ్ఓ బి. ఓంకార్, డీటీఎఫ్ సీఐ భరత్ భూషన్, ఎస్సైలు నరేశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ కేసులో ఏ1 రాంబాబు ఒరిస్సా మల్కానిరి జిల్లా.
ఏ 2 కట్ల వివేక్ రెడ్డి ఘట్కేసర్ మేడ్చల్ జిల్లా (హన్మకొండ), ఏ 3 దగ్గుమల్లి మధు కిరణ్ మేడిపల్లి, మేడ్చల్ జిల్లా (హన్మకొండ) గా గుర్తించారు.
మాదకద్రవ్యాల ముఠాలను సమూలంగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. అక్రమ రవాణాపై నిరంతరం దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.