కేసిఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి.. ఎమ్యెల్సీ కవిత

By Ravi
On
కేసిఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి.. ఎమ్యెల్సీ కవిత

శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.  నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసిందని,  రెండు వారాల క్రితం నేను కేసీఆర్ కు లేఖ రాయడం జరిగిందన్నారు. గతంలో కూడా లేఖ ద్వారా కేసీఆర్ కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పడం జరిగిందని, కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఇటీవలే చెప్పానన్నారు. ఇప్పుడు లేఖ బహీర్గతం అవ్వడంతో ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందిని, పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పాను, ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని కవిత అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమ లేదని మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహీర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.  కేసీఆర్ దేవుడు.. కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి.. వారి వల్ల నష్టం జరుగుతోందని
కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయటికి వచ్చిందటే... పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి ?దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. నేను కేసీఆర్ కు లేఖ ద్వారా వ్యక్తపర్చిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు, లేఖ బహీర్గతం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
లేఖ బహీర్గతం కావడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు, మా నాయకుడు కేసీఆర్ యే....కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా మందుకెళ్తుంది, పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.  కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం అన్నారు. విదేశీ పర్యటన సందర్భంగా హైదరాబాద్ చేరుకున్న కవితకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. నేతలు, కార్యకర్తలతో విమానాశ్రమ ప్రాంతం కిటకిటలాడిపోయింది.

Tags:

Advertisement

Latest News

సంధ్యాథియేటర్ ఘటనపై సీపీ సివి ఆనంద్ కు నోటీసులు జారీ సంధ్యాథియేటర్ ఘటనపై సీపీ సివి ఆనంద్ కు నోటీసులు జారీ
సంధ్య థియేటర్ ఘటనపై సీవీ ఆనంద్‌కు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.సంధ్య థియేటర్ లో పుష్పా సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటకు...
మల్లాపూర్ లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు..
కేసిఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి.. ఎమ్యెల్సీ కవిత
ఫిర్జాదిగూడలో సంబరాలు జరుపుకున్న జనాలు
టిజిఎస్పి సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ప్రదర్శనను పర్యవేక్షించిన డిజిపి జితేందర్
అగ్నిప్రమాదాల నివారణకు అందరూ కలిసి పనిచేయాలి. ఫైర్ డీజీ
నగరంలో పలు హాస్టల్స్ తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు