టిజిఎస్పి సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ప్రదర్శనను పర్యవేక్షించిన డిజిపి జితేందర్

By Ravi
On
టిజిఎస్పి సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ప్రదర్శనను పర్యవేక్షించిన డిజిపి జితేందర్

తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టి జి ఎస్ పి) సిబ్బందితో  ఏర్పాటైన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్ డి ఆర్ ఎఫ్) ప్రదర్శనను  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్  హుస్సేన్ సాగర్ ప్రాంతంలో శుక్రవారం నాడు పర్యవేక్షించారు. వరదలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ లోని అన్ని బెటాలియన్ల సిబ్బందితో ఎస్ డి ఆర్ ఎఫ్  బృందాన్ని ఏర్పాటు చేశారు. గత డిసెంబర్ నెలలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
1వ బెటాలియన్ యూసుఫ్‌గూడ, 2వ బేటాలియన్ ఆదిలాబాద్, 3వ బెటాలియన్ ఇబ్రహీంపట్నం, 4వ బెటాలియన్ వరంగల్, 5వ బెటాలియన్ ములుగు, 6వ బెటాలియన్ కొత్తగూడెం, 7వ బెటాలియన్ నిజామాబాద్, 8వ బెటాలియన్ కొండాపూర్, 10వ బెటాలియన్ బీచ్‌పల్లి, 12వ బెటాలియన్  నల్గొండ, 13వ బెటాలియన్ మంచిర్యాల, 17వ బెటాలియన్ సిరిసిల్ల సిబ్బందితో ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బందితో శిక్షణ ఇప్పించారు.
కటక్ (ఒడిశా), ఆర్కోణం (తమిళనాడు) వడోదర  (గుజరాత్), పూణే (మహారాష్ట్ర), విజయవాడ (AP) లోని NDRF కేంద్రాలలో రెండు నెలల శిక్షణ పొందారు. 
శిక్షణ పొందిన టీజీఎస్పీ సిబ్బంది హుస్సేన్ సాగర్ లోని బోట్ క్లబ్ వద్ద  ప్రదర్శన ఇచ్చారు. బాధితులు నీళ్లలో మునిగిపోయినప్పుడు, ఆపదలో చెప్పుకున్నప్పుడు వారిని రక్షించే ప్రయత్నాలను ప్రదర్శన ద్వారా చూపించారు.  ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్,  టిజిఎస్పి అడిషనల్ డీజీపీ  సంజయ్ కుమార్ జైన్, యూసఫ్ గూడ బెటాలియన్ కమాండెంట్  మురళీకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

కేసిఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి.. ఎమ్యెల్సీ కవిత కేసిఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి.. ఎమ్యెల్సీ కవిత
శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.  నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసిందని,...
ఫిర్జాదిగూడలో సంబరాలు జరుపుకున్న జనాలు
టిజిఎస్పి సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ప్రదర్శనను పర్యవేక్షించిన డిజిపి జితేందర్
అగ్నిప్రమాదాల నివారణకు అందరూ కలిసి పనిచేయాలి. ఫైర్ డీజీ
నగరంలో పలు హాస్టల్స్ తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు
ఆ ఆయుధాల లెక్క తేల్చండి.. డీజీపీ జితేందర్ ఆర్డర్..
తెలంగాణలో 142 మెడికల్ షాప్స్ కి నోటీసులు జారీ