అత్తాపూర్ లో ఓ ఇంటిపై దాడి.. అల్ఫాజోలం స్వాధీనం

By Ravi
On
అత్తాపూర్ లో ఓ ఇంటిపై దాడి.. అల్ఫాజోలం స్వాధీనం

అత్తాపూర్ రాధాకృష్ణ నగర్ ని ఇంటిపై  రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లాల్ శివరాజ్ గౌడ్ ని అదుపులోకి తీసుకొని 615 గ్రాము అల్ఫాజోలం స్వాదీనం చేసుకున్నట్లు ఏ ఈ ఎస్. జీవన్ కిరణ్ తెలిపారు . పట్టుబడ్డ అల్ఫాజోలం విలువ రూ. 6.50 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు.అల్ఫాజోలమును అమ్మకాలు జరపాలని షాద్నగర్  చెందినటు వెంకటయ్య గౌడ్ ఇచ్చారని నిందితుడు విచారణలో తెలిపాడు. ఈ కేసులో లాల్ శివరాజ్ గౌడ్, వెంకటయ్య గౌడ్లపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఏఎస్ జీవన్ కిరణ్ తో పాటు సిఎస్ సుభాష్ చంద్ర, ఎస్సైలు వెంకటేష్, అఖిల్ కుమారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News