అగ్నిప్రమాదాల నివారణకు అందరూ కలిసి పనిచేయాలి. ఫైర్ డీజీ
అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని పన్వార్ హాల్ అగ్ని ప్రమాదాల నివారణకు ఆయా శాఖలు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సూచనలు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, విద్యుత్, టౌన్ ప్లానింగ్, హైడ్రా, ఫైర్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో పురాతన భవనాల లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు శాఖాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై నాగిరెడ్డి వివరణ కోరారు. ఇటీవల గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం సభ్య సమాజాన్ని తీవ్ర ఆందోళన కు గురిచేసిందని, అలాంటి పురాతన భవనాల్లో అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు గా తీసుకోవాల్సిన జాగ్రత్య ల ఆయా శాఖల ద్వారా కావలసిన సూచనలు ఇవ్వాలని కోరారు. అగ్ని ప్రమాదాల నివారణకు ముఖ్యంగా జిహెచ్ఎంసి లో వ్యాపార సముదాయాలు, వ్యాపారం చేసే భవనంలో అగ్ని ప్రమాదం సంభవించకుండా నిరోధించే చర్యల పై ముందస్తు అవగాహన కల్పించి, పాటించని యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని సూచించారు. హెరిటేజ్ బిల్డింగ్ లో గాని, ఇతర బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదాలు సంభవించకుండా ఎలాంటి పరికరాలు వాడాలో ఎలక్ట్రికల్ అధికారులు ప్రైవేటుగా ఫిట్టింగ్ చేసే వ్యక్తులకు అదే విధంగా లైన్ మెన్ లకు పూర్తి అవగాహన కల్పించాలని, అంతేకాకుండా ఎలక్ట్రిక్ షాప్ లు నిర్వహించే యజమానులకు దశల వారీగా అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిస్కమ్ సి.ఈ ని కోరారు. అదే విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఫైర్ సేఫ్టీ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, సేఫ్టీ మెజర్స్ ఉంటేనే ట్రేడ్ లైసెన్స్ గాని, ఎన్.ఓ.సి జారీ చేయాలని సూచించారు. నెలకు ఒక రోజు ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు నాగి రెడ్డి వివరించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వానికి సూచించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమీషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ... శిథిలావస్థలో భవనాలను సర్వే చేయనున్నట్లు తెలిపారు. డి జి గారి సూచన మేరకు వ్యాపార సముదాయాలు, వ్యాపార భావనాలలో ఫైర్ సేఫ్టీ విషయంలో పకడ్బంది చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు నూతన నిర్మాణం కొరకు అనుమతి కోసం వచ్చే ప్లాన్ లో ఫైర్ సేఫ్టీ ప్రాధాన్యత నివ్వాలని కోరారు.వ్యాపార సముదాయాలు, వ్యాపార భవనాలలో ఫైర్ సేఫ్టీ పై చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ... ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఫైర్, పోలీస్ శాఖ మాత్రమే సమాచారం వెళుతున్నదని, అట్టి సమాచారం రెవెన్యూ సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వాలని జిల్లా యంత్రాంగం తరపున అంబులెన్స్, ఆసుపత్రిలో చికిత్స అందించడం బెడ్స్ ,, డాక్టర్లను సిద్ధం చేయడం లాంటి చర్యలు సకాలంలో తీసుకునే వెసులుబాటు ఉంటుందని జిల్లా కలెక్టర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 15 మీటర్ల లోపు ఉన్న భవనాలు, హాస్పిటల్, షాపింగ్ మాల్స్, ఆఫీస్ బిల్డింగ్, లాడ్జింగ్, హోటల్, బిజినెస్ మాల్స్, స్టోరేజీ బిల్డింగ్ లు తప్పని సరిగా ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలన్నారు. తప్పని సరిగా స్మోక్ డిటెక్టర్ తో పాటు అల్లారం కూడా ఉండాలని ఇది నగర వాసులు గమనించాలని కోరారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులు వెంకన్న, ప్రదీప్, డిస్కమ్ సి.ఈ, హైడ్రా, ఫైర్ అధికారులు, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రిసిటీ అధికారులు తమ సూచనలు ఇచ్చారు.