తెలంగాణలో 142 మెడికల్ షాప్స్ కి నోటీసులు జారీ
By Ravi
On
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న షాప్స్ కి నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 142 మెడికల్ షాపులలో మందుల విక్రయానికి సంబంధించి అనేక లోపాలను గుర్తించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం, బిల్లు ఇవ్వకుండా విక్రయించడం, విక్రయ బిల్లులను నిర్వహించకపోవడం లేదా చూపించకపోవడం, నమోదు చేయబడిన ఫార్మసిస్టు లేకుండా మందులు ఇవ్వడం, కొనుగోలు బిల్లులను చూపించకపోవడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ రిజిస్టర్లు మరియు షెడ్యూల్ రిజిస్టర్లను నిర్వహించకపోవడం, విక్రయ మరియు కొనుగోలు బిల్లులు లేకపోవడం గుర్తించారు. ఇందుకు గాను 142 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Tags:
Latest News
23 May 2025 21:58:53
శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసిందని,...