నగరంలో పలు హాస్టల్స్ తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు
జిహెచ్ఎంసి పరిధిలో నిబంధనలు పాటించని హాస్టళ్ల పై ఫుడ్ సేఫ్టీ తో పాటుగా ఇతర శాఖల తో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ బృందాలు శుక్రవారం అమీర్‌పేట, అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ మొదలైన ప్రాంతాల్లో పలు హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ మహిళలు, పురుషులు, విద్యార్థుల అవసరాలను తీర్చడానికి అనేక ప్రైవేట్ హాస్టళ్లు ఆహార భద్రత, పట్టణ ప్రణాళిక, పారిశుధ్యం, అగ్ని ప్రమాద నివారణ మొదలైన నిబంధనలను ఉల్లంఘిస్తూ హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. హాస్టళ్ల యాజమాన్యం సెల్లార్లను, పార్కింగ్ ప్రాంతాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం, నియమ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద హోర్డింగ్‌లను ప్రదర్శించడం, అపరిశుభ్రంగా తయారు చేస్తున్న నాణ్యత లేని ఆహారాన్ని సరఫరా చేయడం, చిన్న గదుల్లో విద్యార్థును పెట్టడం, సరిపోను సరైన మరుగుదొడ్లు వంటి వారి ప్రాథమిక అవసరాలను విస్మరించారు. అంతేకాకుండా వీధుల్లో వ్యర్థాలను పారవేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. నిర్వాహకులతో పాటుగా, భవన యజమానులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినప్పటికీ, కొన్ని యాజమాన్యాలు ఇప్పటికీ అపరిశుభ్రమైన పరిస్థితులు నిర్వహించడంలో బాధ్యతారహితంగా ఉన్నాయి. ఇది ప్రజలకు ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుంది. అటువంటి ఉల్లంఘనలను అరికట్టడానికి, జీహెచ్ఎంసీ అంతటా చట్టాలను ఉల్లంఘించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న హాస్టళ్లపై (ఉదాహరణకు అమీర్‌పేట, ఖైరతాబాద్ జోన్, అశోక్ నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించడానికి జీహెచ్ఎంసీ అధికారులతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట ప్రాంతాలలో సుమారు 58 హాస్టళ్లను తనిఖీ చేసి, 30 హాస్టళ్లకు నోటీసులు జారీచేసి, 5 హాస్టల్ కిచెన్‌లను మూసివేయబడ్డాయి. జీహెచ్ఎంసీ 1955 యాక్ట్ నిబంధనల ప్రకారం రూ.2,45,500/- జరిమానా విధించారు.