నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడి. 4.64కేజీల గంజాయి స్వాధీనం

By Ravi
On
నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడి. 4.64కేజీల గంజాయి స్వాధీనం

ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్  ఎస్టిఎఫ్ టీములు నాలుగు కేసుల్లో 4.64 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐడిఏ బొల్లారం పటాన్ చెరువు ప్రాంతంలో  ఎస్ టి ఎఫ్ బి టీం ఎస్సై నాగరాజు బృందం దాడి చేసి 1.14 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయితోపాటు ఒక బైకు రెండు మొబైల్స్,  రాఘవేందర్, రోషన్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. నందు, అజయ్ అనే ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 
 అమీర్పేట్ ఎస్ఆర్ మోటార్ సర్వీసింగ్ సిపిఎల్ రోడ్ లో 1.1 కేజీల గంజాయిని  పట్టుకున్నారు. ఈ కేసులో కుష్మి శ్రీనాథ్, వాడపల్లి కార్తీక్ లను అరెస్ట్ చేసి గంజాయితోపాటు అమీర్పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
చార్మినార్ ప్రాంతంలో ఎస్టిఎఫ్ ఏటీం లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 1.30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 
 ఈ కేసులో సలీం బిన్ నజీర్, బాల్మన్ మహమ్మద్ అక్బర్ ఖాన్ ను అరెస్ట్ చేయగా రహీంఖాను పరారీలో ఉన్నట్లు తెలిపారు.
 మరో కేసులో కుత్బుల్లాపూర్ ప్రాంతంలో1.1 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
 ఈ కేసులో వడగతేజ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

Tags:

Advertisement

Latest News

లంచం తీసుకుంటూ ఏసీబీకి బుక్ అయిన టౌన్ ప్లానింగ్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి బుక్ అయిన టౌన్ ప్లానింగ్ అధికారి
సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసి జోనల్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. భవనం నిర్మాణం అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ విఠల్‌రావును రెడ్ హ్యాండెడ్...
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..
నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడి. 4.64కేజీల గంజాయి స్వాధీనం
తిరుమలలో నమాజ్ కలకలం...
పునాధులతో సహా తొలగించిన హైడ్రా
మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది
కవిత లేఖ.. బిఆర్ఎస్ లో లుకలుక