విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..

By Ravi
On
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 (ఎస్ఎంఎస్-2) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం, ఎస్ఎంఎస్-2లోని ఒక పైప్‌లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీకై మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక దళాలు, రెస్క్యూ టీమ్‌లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద తీవ్రత, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

Advertisement

Latest News

టిజిఎస్పి సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ప్రదర్శనను పర్యవేక్షించిన డిజిపి జితేందర్ టిజిఎస్పి సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ప్రదర్శనను పర్యవేక్షించిన డిజిపి జితేందర్
తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టి జి ఎస్ పి) సిబ్బందితో  ఏర్పాటైన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్ డి ఆర్ ఎఫ్) ప్రదర్శనను  డైరెక్టర్...
అగ్నిప్రమాదాల నివారణకు అందరూ కలిసి పనిచేయాలి. ఫైర్ డీజీ
నగరంలో పలు హాస్టల్స్ తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు
ఆ ఆయుధాల లెక్క తేల్చండి.. డీజీపీ జితేందర్ ఆర్డర్..
తెలంగాణలో 142 మెడికల్ షాప్స్ కి నోటీసులు జారీ
లంచం తీసుకుంటూ ఏసీబీకి బుక్ అయిన టౌన్ ప్లానింగ్ అధికారి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..