సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్మకం.. నలుగురు అరెస్టు

By Ravi
On
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్మకం.. నలుగురు అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయితో కొందరు వ్యక్తులు ఉన్నారని సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ సిబ్బంది కలిసి రైల్వే స్టేషన్ సమీపంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో2.350 కేజీల గంజాయి పట్టుబడినట్లు సిఐ తెలిపారు. గంజాయి తో పాటు బైకు, 4 నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.1.50. లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో ఫరీదా ఖాన్, ఎండి సలాం, ఎండి సల్మాన్, ఆసిస్ ఖాన్ లను  అరెస్ట్ చేసి సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.

Tags:

Advertisement

Latest News