ఇటుకబట్టీల్లో చైల్డ్ లేబర్.. అధికారుల సీరియస్

By Ravi
On
ఇటుకబట్టీల్లో చైల్డ్ లేబర్.. అధికారుల సీరియస్

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలో అధికారులు సర్వే చేశారు. ఇటుక బట్టీల్లో చైల్డ్ లేబర్ ని గుర్తించారు. జగ్గంగుడాకుచెందిన తోకల మాధవరెడ్డి ఇటుకబట్టిలో సుమారు 28 కుటుంబాలు పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటుకబట్టి యజమాని తోకల మాధవరెడ్డి కార్మికులను వేదిస్తున్నాడని. బాలకార్మికులతో పనిచేయిస్తున్నాడని, బాండెడ్ లేబర్లను పనిలో పెట్టుకున్నాడని బట్టిలో పనిచేసే ఓ వ్యక్తి తన సొంత రాష్ట్రమైన ఒడిస్సాకు వెళ్లి ఓ స్వచ్చంద సంస్థను ఆశ్రయించి పిర్యాదు చేశాడు. అక్కడి స్వచ్చంద సంస్థ ప్రతినిధులు లేబర్ అధికారులు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీనర్లు ఇట్టి విషయాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీనువచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక తహాశీల్దార్ వెంకటనర్సింహారెడ్డి, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, లేబర్ అధికారులు ఇటుకబట్టికి వెళ్లి విచారణ చేపట్టారు. మొత్తం 28 కుటుంబాలకు చెందిన సుమారు 92 మంది ఇటుకబట్టిల్లో ఉన్నారని తెలుసుకున్నారు. ఇందులో 7 గురు బాలకార్మికులు, ఇద్దరు బాండెడ్ లేబోర్లు పనిచేస్తున్నట్లు తహాశీల్దార్ గుర్తించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటుకబట్టిని సందర్శించి బాలకార్మికులను, బాండెడ్ లేబర్లను గుర్తించామని అన్నారు. లేబర్ అధికారులకు నివేదిక సమర్పించామని వారు ఇటుకబట్టి యజమానిపై కేసు నమోదు చేస్తారని చెప్పారు. ఇటుకబట్టిలో పనిచేస్తున్న వారందరిని వారి రాష్ట్రానికి వంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాలకార్మికులను వనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ అధికారి సాయికుమార్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇంతియాజ్ శామీర్పేట తహాశీల్దార్ యాదగిరిరెడ్డి. సిఐ శ్రీనాథ్. స్వచ్చంద నంస ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. 24 మంది ఫైనలిస్టుల జాబితాను మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఈ...
కవిత లేఖ.. బిఆర్ఎస్ లో లుకలుక
ఇటుకబట్టీల్లో చైల్డ్ లేబర్.. అధికారుల సీరియస్
సీఎం ఓఎస్డి అంటూ మాజీ క్రికెటర్ బెదిరింపులు.. అరెస్ట్
బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసుల సమన్వయ సమావేశం
కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఎక్స్ లోకి అడుగుపెట్టిన డిసిఏ..