సీఎం ఓఎస్డి అంటూ మాజీ క్రికెటర్ బెదిరింపులు.. అరెస్ట్

By Ravi
On
సీఎం ఓఎస్డి అంటూ మాజీ క్రికెటర్ బెదిరింపులు.. అరెస్ట్

సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డ్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేటకు చెందిన నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తాను సీఎం ఓఎస్టీ అని చెప్పుకొంటూ పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్లకు వాట్సాప్ మెసేజ్లు పంపాడు. బాధితుల ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఓఎస్టీ పేరుతో నాగరాజు ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసినట్టు గుర్తించారు. శ్రీకాకుళంలో నాగరాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. గతంలో కోడెల శివరాంపై తప్పుడు కేసులు పెట్టి. ఈ మధ్యే వాటిని వెనక్కి తీసుకున్నాడు. 2023లో శ్రీకాకుళంలో 22 కిలోల గంజాయి తరలిస్తుండగా పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు.

Tags:

Advertisement

Latest News

మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. 24 మంది ఫైనలిస్టుల జాబితాను మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఈ...
కవిత లేఖ.. బిఆర్ఎస్ లో లుకలుక
ఇటుకబట్టీల్లో చైల్డ్ లేబర్.. అధికారుల సీరియస్
సీఎం ఓఎస్డి అంటూ మాజీ క్రికెటర్ బెదిరింపులు.. అరెస్ట్
బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసుల సమన్వయ సమావేశం
కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఎక్స్ లోకి అడుగుపెట్టిన డిసిఏ..