కవిత లేఖ.. బిఆర్ఎస్ లో లుకలుక
బిఆర్ఎస్ బాస్ గారాలపట్టి కవిత రాసిన లేఖ ఇంటా బయట పెద్ద రచ్చ అయ్యింది. ఇటీవల జరిగిన సభలో గుడ్, బ్యాడ్ అంటూ ఆరు పేజీల లెటర్ లో అనేక అంశాల ప్రస్తావన చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న కవిత రాసిన లెటర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎవరికి నచ్చినట్లు వారు అంతర్గత విభేదాలు అంటూ కొందరు.. భలే అడిగింది ఆ లెటర్ తో ఇదే కేటీఆర్ ని సోషల్ మీడియాలో నిలదీయాలని కొందరు ఇలా ఎవరికి వారు చర్చలు మొదలు పెట్టారు. తన తండ్రి కేసీఆర్ కి రాసిన లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ లెటర్ బయటకు ఎలా వెళ్లింది. ఆ ఇంటి దొంగ ఎవరు అనేది తేలాల్సివుంది. అయితే కవిత రాసిన లేఖ సారాంశంలో ఉన్న మాటలు ఆ పార్టీలో చర్చ మొదలైంది.
ఆరు పేజీలతో కూడిన లేఖను తన తండ్రి కేసీఆర్ కు కవిత బహిరంగ లేఖ
*పార్టీలో జరుగుతున్న తప్పుల గురించి ప్రస్తావించిన కవిత*
సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలో ఆపరేషన్ కగార్ పై మాట్లాడటం అందరికీ నచ్చింది డాడీ.
పర్సనల్ గా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవటం హుందాగా అనిపించింది.
తెలంగాణ తల్లినీ మార్చడం, గీతాన్ని మార్చడం మెన్షన్ చేసి మాట్లాడకపోవడం నచ్చలేదు.
ఉర్దూ, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవటం బాధాకరం.
బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించారు.
ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం బాధాకరం.
ఇంత పెద్ద మీటింగ్ కు పాత వారికే బాధ్యతలు అప్పగించడంతో తెలంగాణ ఉద్యమ కారులకు సదుపాయాలు కల్పించలేదని , చాల నియోజకవర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.
పాత ఇంచార్జ్ లకే లోకల్ బాడీ ఎన్నికల్లో బి ఫామ్ లు ఇస్తారని ఇంచార్జ్ లు చెప్పుకుంటున్నారు
Mptc, zptc గా పోటీ చేయాలనుకునే వాళ్ళకి రాష్ట్ర పార్టీ మాత్రమే బి ఫామ్ ఇవ్వాలి.
2001 నుంచి మీతో నడిచిన వారికి సిల్వర్ జూబ్లీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది.
ధూమ్ ధాం పార్టీ శ్రేణులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది.
సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలో బిజెపి పై రెండు నిమిషాలే మాట్లాడడంతో రాబోయే ఎన్నికల్లో బిజెపి , బిఆర్ఎస్ పెట్టుకుంటారని చర్చ జోరుగా జరుగుతుంది.
నేను పర్సనల్ గా సఫర్ అయ్యాను. మీరు బిజెపి పై గట్టిగా మాట్లాడుంటే బాగుండేది.
కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయింది. బీజేపీ బలపడుతుందని మన క్యాడరే అభిప్రాయపడుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బిజెపికి హెల్ప్ చేసిందని ప్రచారాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకుపోయింది.
త్వరలోనే ఒక ప్లీనరీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలి.
పార్టీలో ముఖ్య నేతలు మిమ్మల్ని కలవలేక పోతున్నారు... అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని బాధపడుతున్నారు.
కొంతమందినీ మాత్రమే కెసిఆర్ కలుస్తున్నారనీ చర్చ జరుగుతుంది.
ప్రతి ఒక్కరిని కలవడానికి ప్రయత్నించండి *డాడీ*.
ఇది కవిత రాసిన లెటర్ లోని అంశాలు. మరి వీటిని పరిగణలోకి తీసుకుని పద్ధతులు మార్చుకుంటారా.. లేక ఆ లెటర్ ప్రతిపక్షాల కుట్ర అని కొట్టి పారేస్తారో చూడాల్సిందే..