ఏఆర్ జవాన్ సందీప్ భౌతికకాయనికి నివాళులర్పించిన సీపీ సుధీర్ బాబు

By Ravi
On
ఏఆర్ జవాన్ సందీప్ భౌతికకాయనికి నివాళులర్పించిన సీపీ సుధీర్ బాబు

నక్సలైట్ల కాల్పుల్లో వీర మరణం పొందిన మేడ్చల్ నియోజకవర్గం  పరిధిలోని ఘట్కేసర్ కు  చెందిన రాచకొండ AR జవాన్ తిక్క సందీప్ భౌతిక కాయాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించారు. సీపీతో పాటు రాష్ట్ర ఐటి, పరిశ్రమ, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టిపిసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కలిసి రాచకొండ AR జవాన్ తిక్క సందీప్ గారి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Tags:

Advertisement

Latest News