మేడిపల్లి సేజ్ స్కూల్ ఆవరణలో కట్టడాల కూల్చివేతలు

By Ravi
On
మేడిపల్లి సేజ్ స్కూల్ ఆవరణలో కట్టడాల కూల్చివేతలు

ఉప్పల్  మేడిపల్లి ఆర్‌ఏఆర్ కాలనీలోని సేజ్ పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి అనుసంధాన మార్గంలో ఈ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
పాఠశాల యాజమాన్యం కీలకమైన లింక్ రోడ్డులోని కొంత భాగాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని స్థానికులు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణల వల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కబ్జాపై కాలనీ వాసులు 15 ఏళ్లుగా పోరాడుతున్నారని తెలిసింది. అందిన ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా అధికారులు, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఈ తనిఖీల్లో నిర్ధారణ అయింది. దీంతో బుధవారం ఉదయం పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక బృందాలు పాఠశాల వద్దకు చేరుకుని, రోడ్డుపైకి చొచ్చుకుని వచ్చిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ఈ కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

#Draft: Add Your Title #Draft: Add Your Title
శ్రీ స్వామివారి దేవస్థానం నుండి బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ తల్లి ఆలయమునకు గంగమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా పట్టు వస్త్రాలను సమర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు...
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి
బంగారం పోయింది అని.. కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం
తెలంగాణలో నకిలీ వైద్యులకు చెక్ పెట్టిన డిసిఏ అధికారులు
మేడిపల్లి సేజ్ స్కూల్ ఆవరణలో కట్టడాల కూల్చివేతలు
డిసిఎంను ఢీకొట్టిన కార్.. ముగ్గురు మృతి