పెద్దఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. కారులోనే వ్యక్తి సజీవదహనం

By Ravi
On
పెద్దఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. కారులోనే వ్యక్తి సజీవదహనం

పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వేగంగా దూసుకు వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఇంజన్ లో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వారిలో ఒకరు మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు పరుగున వెళ్లి కారులో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తిని కాపాడారు. ఈ ఘటన  పెద్దఅంబర్ పేట్ నుండి ఘట్కేసార్ వెళుతున్న ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డులో జరిగింది. చూస్తుండగానే కారు, బొలెరో వాహనం పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఎవరూ అనేది తెలియాల్సి ఉంది. రింగ్ రోడ్డు మీద బొలెరో వాహనం ఆపడం ఎలాంటి సిగ్నల్ ఇవ్వకపోవడంతో వెనుక వస్తున్న కార్ బొలెరో వాహనం గమనించక ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

ఛార్ ధామ్ యాత్ర నిలిపివేత ఛార్ ధామ్ యాత్ర నిలిపివేత
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల క్షేమం దృష్ట్యా ఛార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు...
కుత్బుల్లాపూర్ లో ఆపరేషన్ సింధూర్ వాక్
ఈ నెంబర్లకు కాల్ చేయండి
పెద్దఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. కారులోనే వ్యక్తి సజీవదహనం
మురళి నాయక్ కు నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు
తిరుమలలో రంగంలోకి దిగిన ఆక్టోపస్ బలగాలు
ఆపరేషన్ చేయూత.. లొంగిపోయిన 38 మావోయిస్టులు