గంజాయి.. డ్రగ్స్ పై ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్
యువత, ప్రజలకు ప్రాణాంతంగా మారిన గంజాయి, డ్రగ్స్‌ను పూర్తిస్థాయిలో అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ కీలక భూమిక పోషించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం అన్నారు. బుధవారం ఎస్ టి ఎఫ్ టీమ్‌ల సమావేశ అనంతరం ఆయన ఈ నెల 8 నుంచి 14 వరకు తెలంగాణలో ఎస్టిఎఫ్ , ఎన్‌ఫోర్స్‌మెంట్, డిటిఎఫ్ టీమ్‌లతో పాటు ఎక్సైజ్‌శాఖ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్‌లో మేరకు అన్ని కోణాల్లో దాడులు నిర్వహించాలని డైరెక్టర్ అదేశించారు. ఎన్‌డీపీఎస్‌ను అరికట్టడానికి తలపెట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో ప్రతి ఒక్కర శక్తి వంచనలేకుండా దాడుల్లో పాల్గొని నార్కోటిక్ డ్రగ్స్‌ను పట్టుకొవడంలో కృషీ చేయాలని డైరెక్టర్ పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్‌తోపాటు ఆల్పోజోలం, డైజోపామ్ రవాణా, అమ్మకాలు, వినియోగం, దిగుమతుల పై నిఘా పెట్టి పట్టుకోవాలని సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో యంత్రాంగం పని తీరే ప్రమాణికంగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. గత సంవత్సరం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధ్వర్యంలో జనవరి, జూన్, సెప్టెంబ ర్ నెలల్లో ఎన్‌డీపీఎస్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని అన్నారు. ఈ మూడు స్పెషల్ డ్రైవ్‌లో 383 కేసులు నమోదు అయ్యాయని, 644 నిందితులను అరెస్టు చేశామని, 2639 కేజీల గంజాయి, 99.23 గ్రాముల ఎండిఎంఎ, 6.33 కేజీల ఆల్పోజోలంను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తామని అన్నారు.