దుండిగల్ లో పాత నేరస్థుల అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం
By Ravi
On
జల్సాలకు అలవాటు పడి అక్రమ సంపాదనే లక్ష్యంగా రాత్రిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్థులను మేడ్చల్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సూరారం కాలనీకి చెందిన హరిబాబు (20), సూర్య (20) అనే నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి 14 తులాల బంగారం, 1కేజి వెండి, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు .వీరిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో ఒకరిపై 8 మరోకరిపై 6 దొంగతనం కేసులు ఉన్నట్లు ఎసిపి శంకర్ రెడ్డి తెలిపారు. పలు కేసుల్లో జైలుశిక్ష అనుభవించి వచ్చిన వారి ప్రవర్తనలో తేడా లేదని మేడ్చల్ ఎసిపి వెల్లడించారు.ఈ మీడియా సమావేశంలో దుండిగల్ మరియు సూరారం పిఎస్ సిసిఎస్ మేడ్చల్ పోలీసులు, దుండిగల్ సీఐ సతీష్, సూరారం సీఐ భరత్ కుమార్, సూరారం పిఎస్ డిఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
21 May 2025 08:32:17
హయత్ నగర్ కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తునం డీసిఎం ను ఢీకొట్టిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు...