సంగారెడ్డిలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు.. కాలం చెల్లిన మందులు స్వాధీనం

By Ravi
On
సంగారెడ్డిలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు.. కాలం చెల్లిన మందులు స్వాధీనం

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్  అధికారులు వావిలాల గ్రామం, జిన్నారం మండలం, సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక నకిలీ వైద్యుని క్లినిక్ పై దాడి చేసి అక్కడ చట్టవిరుద్ధంగా నిల్వచేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు.  2024 జనవరి నుండి ఇప్పటివరకు, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ 160 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసింది. ఆర్. సత్యనారాయణ అనే వ్యక్తి ఎలాంటి అర్హతలు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు దాడి చేసి క్లినిక్ లో ఉన్న 25 రకాల మందులు స్వాధీనం చేసుకున్నారు.   ఔషధాలలో గడువు ముగిసిన మందులు కూడా కనుగొన్నారు.
అర్హత లేని వ్యక్తులచే యాంటిబయాటిక్స్ విచక్షణా రహితంగా విక్రయించబడటం ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపించగలదని ఇది యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (Antimicrobial Resistance) ను పెంచే ప్రమాదం ఉందని తెలిపారు. జి. శ్రీకాంత్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, జిన్నారం మరియు టి.IMG-20250509-WA0068 ప్రవీణ్ కుమార్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, బొల్లారంలు పి. రాము, అసిస్టెంట్ డైరెక్టర్, పటాన్‌చెరు పర్యవేక్షణలో దాడి నిర్వహించారు. అధికారులు నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్ కి పంపారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా మందులను సరఫరా చేస్తున్న వ్యక్తులకు మందులు ఇచ్చే హోల్‌సేలర్లు/డీలర్లు పై కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోల్‌సేలర్లు/డీలర్లు మందులు అందించే వ్యక్తుల వద్ద తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రగ్ లైసెన్స్ ఉందో లేదో నిర్ధారించుకోవాలన్నారు.

Tags:

Advertisement

Latest News