రాజ్ భవన్ లో దొంగలు పడ్డారు....

By Ravi
On
రాజ్ భవన్ లో దొంగలు పడ్డారు....

కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్క్ లు మాయం చేశారు

హెల్మెట్ ధరించి మరీ దర్జాగా చోరీ చేసిన దుండగుడు

చోరీ జరిగిన కొద్దిరోజులకు గాని విషయం తెలుసుకోని సిబ్బంది

సిసి ఫుటేజ్ ద్వారా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

 

ఫుల్ టైట్ సెక్యూరిటీ.. అడుగడుగునా సిసి కెమెరాలు..    బయట నుండి లోపల వరకు పోలీసుల పహారా.. అనుమతి లేనిదే ఎవ్వరు కాలు పెట్టాడని వీలులేదు.. కనీసం అటువైపు చూసే ప్రసక్తతే లేదు.. అలాంటి హైసెక్యురిటి ప్లేస్ లో చోరీ జరిగింది. అదెక్కడో కాదు మన తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ జరిగింది. ఈ విషయం కాస్త  ఆలోస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజ్ భవన్ సుధర్మ భవన్ లో హార్డ్ డిస్కులు మాయమయ్యాయి. 14వ తేదీన హెల్మెట్ ధరించి దుండగుడు కంప్యూటర్లు ఉన్న గదిలోకి చొరబడి 4హార్డ్ డిస్క్ లతో పరారయ్యాడు. ఈహార్డ్ డిస్క్ లో కీలకమైన సమాచారం, ఫైల్స్ ఉన్నట్లుగా రాజ్ భవన్ అధికారుల గుర్తించారు. విషయం గమనించి అప్రమత్తమైన రాజ్ భవన్ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫోటేజ్ ఆధారంగా హెల్మెట్ దొంగ వ్యవహారం బయట పడింది. కేసు నమోదు చేసి సిసి ఫుటేజ్ పలుమార్లు పరిశీలించిన పోలీసులు ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే అని అనుమానిస్తున్నారు. బయట వ్యక్తి లోపలికి వచ్చే చాన్స్ లేదు ఒకవేళ వస్తే ఎలా వచ్చాడు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. రాజ్ భవన్ కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్క్ లు మాయం కావడం అధికారులను టెన్షన్ కి గురిచేస్తోంది. కేసు నమోదు చేసి సిసి ఫుటేజ్ ద్వారా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన ఓ పోలీసులు అసలు విషయం రాబట్టారు. రాజ్ భవన్ లో ఉన్న ఓమహిళ ఫోటోను  అక్కడ పని చేసే సిబ్బంది మార్ఫింగ్ చేశాడు. అవి బయటకు వస్తాయేమో అని హార్డ్ డిస్క్ లు మాయం చేసినట్లు తెలుసుకున్నారు. మార్ఫింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని, మహిళ నుండి హార్డ్ డిస్క్ లు స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం.

Tags:

Advertisement

Latest News

ఆదాయవనరులు పెంచండి.. సమీక్షలో అధికారుల ఆదేశాలు ఆదాయవనరులు పెంచండి.. సమీక్షలో అధికారుల ఆదేశాలు
నేరాలను అరికట్టండి.. ఆదాయ వనరులను పెంచాలని తెలంగాణ ఎక్సైజ్‌ అధికారుల సమీక్షా సమావేశంలో కమిషనర్ సి.హరి కిరణ్‌,  డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం అన్నారు. త్వరలో ఎక్సైజ్‌ శాఖలో...
ఘట్కేసర్ ఓఆర్ఆర్ పై అయిదుగురు అరెస్ట్. 58.8కేజీల గంజాయి స్వాధీనం
మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త
బిఆర్ఎస్ బాస్ కి బిగుసుకున్న ఉచ్చు..
పాతబస్తీలో మరో అగ్నిప్రమాదం
లైసెన్స్ లేని మందుల షాప్ పై డిసిఏ దాడి.. ఔషధాలు స్వాధీనం
పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై కమిటీ ఏర్పాటు.. విచారణ ప్రారంభం..