ఆపరేషన్ సింధూర్.. ఆల్విన్ కాలనీలో సంబరాలు

By Ravi
On
ఆపరేషన్ సింధూర్.. ఆల్విన్ కాలనీలో సంబరాలు

ఉగ్రవాదులు నిర్ములానే లక్షంగా భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ పేరిట నిర్వహించిన  దాడులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆల్విన్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్  ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పాకిస్తాన్ జెండాను రోడ్డుపై పడవేసి కాలుతో తొక్కారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గామ్ లో 10 రోజుల క్రితం అమాయక ప్రజలను టార్గెట్గా చేసుకొని దాడులు నిర్వహించిన ఉగ్రముకులకు తగిన శాస్తి జరిగిందని అన్నారు. ఆపరేషన్ సింధు పేరిట ఆరు చోట్ల భారత సైన్యం జరిపిన దాడులకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు. భర్తలు కోల్పోయిన మహిళలకు న్యాయం చేయాలని ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం చనిపోయిన వారికి తగిన నివాళి అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో మరోసారి ఉగ్రదాడి జరగాలంటే పాకిస్తాన్ కు భయం పుట్టేలా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న వాటిని సహకరిస్తామని అన్నారు.

Tags:

Advertisement

Latest News

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్