రోహింగ్యాలను వెంటనే తరలించాలని డిమాండ్..!
By Ravi
On
నగరంలో అక్రమంగా నివాసముంటున్న రోహింగ్యాలను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో రోహింగ్యాలు అక్రమంగా నివసించే ప్రాంతాన్ని పరిశీలించి.. అనంతరం బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దాదాపు 20 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని.. వారికి ఇక్కడున్న వారే షెల్టర్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా బాలాపూర్ ఎమ్మార్వో, పోలీసు శాఖ సమగ్ర దర్యాప్తు నిర్వహించి 15 రోజుల్లోపు వారిని గుర్తించి ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే వారిని తరిమి కొడతామని హెచ్చరించారు.
Related Posts
Latest News
06 May 2025 18:19:37
సరూర్‌నగర్ మన్సూరాబాద్ లో అక్షయ్ కుమార్(30) తన ఇంట్లో చిన్న సైజ్ వైన్ షాప్ ఓపెన్ చేశాడు. పలు రాష్ట్రాల నుండి నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్...