వృద్ధ దంపతుల హత్య కేసులో పాత నేరస్థుడి అరెస్ట్
మేడ్చల్ జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్య నగర్ లో ఈనెల 3వ తేదీన జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు చేదించారు. డబ్బుల కోసం పలు నేరాలు(రేప్ మరియు మర్డర్ లు ) చేస్తూ గతంలో జైలు శిక్ష అనుభవించి బైటికి వచ్చిన అనిల్ (36) అనే కరుడు గట్టిన పాత నేరస్థుడిని అల్వాల్ అరెస్ట్ చేశారు. ఈనెల 3వ తేదీ రాత్రి నిద్రిస్తున్న కనకయ్య(70), రాజమ్మ (65)లను పక్కనే ఉన్న సెంట్రింగ్ కర్రతో తలలు పగలకొట్టి, హత్య చేసి వారి శరీరంపై ఉన్న నగలు, ఇంట్లో ఉన్న డబ్బులతో పరారయ్యాడు. 4వ తేదీన ఫిర్యాదు అందుకున్న అల్వాల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతని వద్ద నుండి వృద్ధ దంపతుల వద్ద దొంగిలించిన 2సెల్ ఫోన్లు, బంగారు, వెండి ఆభరణాలు స్వాదీనం చేసుకున్నారు. మేడ్చల్ జోన్ డిసిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.