పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం

By Ravi
On
పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం

ఇంటిరీయల్‌ పనుల్లో నైపుణ్యత కలిగిన వృత్తి కళాకారుడు. వృత్తితో పాటు ప్రవృత్తిగా గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు చేపడుతూ రూ. రెండున్నర లక్షల బైక్‌, రూ. లక్షన్నర సెల్‌తో గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ టి ఎఫ్  బి టీమ్‌ ఎస్సై  బాలరాజు సిబ్బంది కలిసి కుత్భుల్లాపూర్‌ శివారెడ్డి నగర్‌లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో షరీఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి  వద్ద 1.360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  రూ. లక్షల విలువ చేసే బైక్‌ను, సెల్‌ ఫోన్ ను, గంజాయిని  ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించామని ఎస్సై బాలరాజు తెలిపారు. ఇదే  కేసులో అఖిల్‌ అనే వ్యక్తిపై కూడ కేసు నమోదు చేశారు.

మరో కేసులో...

గొల్కోండ టీఎస్‌ఎస్‌ పీడీసీఎల్‌ మారుతి లంగర్‌ హౌజ్‌   ప్రాంతంలో హెచ్ డి ఎఫ్ బి టీమ్‌ నిర్వహించిన దాడుల్లో 5  గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ను పట్టుబడింది. డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతున్న మహ్మమద్‌ సులేమాన్‌ ను అతడి వద్ద ఉన్న రెండు సెల్‌ ఫోన్ , ఒక బైక్‌ను  స్వాధీనం చేసుకున్నట్లు టీమ్‌ లీడర్‌ అంజి రెడ్డి తెలిపారు. ఈ కేసులో బెంగూళూరుకు చెందిన షకీల్‌పై కూడ  కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.  నిందితుడిని, డ్రగ్స్‌ను గోల్కోండ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించామని తెలిపారు.IMG-20250505-WA0139

Tags:

Advertisement

Latest News

కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..! కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..!
- కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం- ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తి- కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న రేవంత్‌ పేరు- కులగణనలో తెలంగాణ మోడల్‌ తీసుకోవాలని విజ్ఞప్తి-...
సమ్మె వద్దు.. ఆర్టీసీ యాజమాన్యం లేఖ
ఆర్టీసీ ఆసుప‌త్రిలో డీఎన్‌బీ పీజీ మెడిక‌ల్ కోర్సులు
పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం
ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..!
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!