కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు

By Ravi
On
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు

వికారాబాద్‌ ఈఎస్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీధర్‌ను కక్షపూరితంగా ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌  శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టించడంపై తెలంగాణ నాన్‌ గెజి టెడ్‌ ఉద్యోగుల  సంఘం తప్పుబట్టింది.  సోమవారం ఎక్సైజ్‌ భవన్‌లోని సమావేశ మందిరంలో ఎక్సైజ్‌  మినిస్ట్రియల్‌ ఉద్యోగుల సంఘం నాయకులు సమావేశమయ్యారు.
వికారాబాద్‌లో ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ కార్యాలయంలో పని చేసే శ్రీధర్‌కు హెడ్‌ కానిస్టేబుల్‌ టీఏ బిల్లులను మంజూరు ఫిబ్రవరిలో ఇచ్చారని మార్చిలో 3న హెడ్‌ కానిస్టేబుల్‌ బ్యాంక్‌ ఖాతాలో  డబ్బులు పడ్డాయన్నారు.      
 కాని సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీధర్‌ను హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్దేశ్య పూర్వకంగా ఏసీబీకి పట్టించడం సరికాదన్నారు. ఎక్సైజ్‌ శాఖలో అందరు కలిసిమెలిసి  ముందుకు సాగుతున్న తరుణంలో ఇలాంటి ఘటన ఉద్యోగులందరిలో భయాందోళనలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఎక్సైజ్‌శాఖలోని ఇక నుంచి ఎవ్వరి టీఏ  బిల్లులను మినిస్ట్రియల్‌ సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఆఫీస్ సూపరింటెండెంట్లు చేయమని నిర్ణయం తీసుకున్నట్లు  టీఏన్జీఓస్‌ సెంట్రల్‌ యూనియన్‌ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌  తెలిపారు. ఈ విషయంలో మినిస్ట్రియల్‌ ఉద్యోగులకు  న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, టి ఏ  బిల్లుల విషయంలో సరియైన  మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌  సి.హరికిరణ్‌కు టీఎన్జీవో సంఘం నాయకులు  కలిసి వినతి పత్రాన్ని అందించారు. అధ్యక్షుడితోపాటు ప్రధాన కార్యదార్శి ఎన్‌. అనిల్‌ కుమార్‌, కోశాధికారి పి. క్రాంతి కుమార్‌లు అన్ని జి ల్లాల అధ్యక్ష,  కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..! కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..!
- కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం- ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తి- కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న రేవంత్‌ పేరు- కులగణనలో తెలంగాణ మోడల్‌ తీసుకోవాలని విజ్ఞప్తి-...
సమ్మె వద్దు.. ఆర్టీసీ యాజమాన్యం లేఖ
ఆర్టీసీ ఆసుప‌త్రిలో డీఎన్‌బీ పీజీ మెడిక‌ల్ కోర్సులు
పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం
ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..!
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!