చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్
పాతబస్తీ బీబీక చష్మ ప్రాంతంలో ఈ నెల 2వ తేదీన జరిగిన మాజిద్ హత్య కేసును ఫలక్ నుమా పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 కత్తులు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మూఢ నమ్మకమే ఈ హత్య కు ప్రధాన కారణం అని ఏసీపీ ఫలక్ నుమా ma జావిద్ వెల్లడించారు. నిందితులు షేక్ ముహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ మరియు షేక్ అక్తర్ అలీ ఈ హత్య కేసులో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్ మొహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ అన్నదమ్ములు, 3వ నిందితుడు షేక్ అక్తర్ అలీ వీరి తండ్రి. ముగ్గురు నిందితులు మృతుడు మాజీద్ వారి కుటుంబీకులు నిందితులపై చేతబడి చేశారన్న అనుమానంతో మాజిద్ ను హత్య చేసినట్లు దర్యాప్తులో నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2వ తేదీన ఈ ముగ్గురు నిందితులు, మాజీద్ ఒంటరిగా ఉండటం చూసి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పదునైన కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చారు.
హత్య చేసిన నిందితులను ఈ రోజు ఫలక్ నుమా పోలీసులు అంబర్ పేట ప్రాంతంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.