గంజాయి ఇంట్లో పెట్టడానికి నిరాకరించాడని దాడి

By Ravi
On
గంజాయి ఇంట్లో పెట్టడానికి నిరాకరించాడని దాడి

గంజాయి ఇంట్లో పెట్టడానికి నిరాకరించినందుకు యువకుడిపై దాడి చేసిన సంఘటన అత్తాపూర్, సులేమాన్‌నగర్లో చోటుచేసుకుంది. గంజాయిని తమ ఇంట్లో పెట్టుకోవడానికి నిరాకరించినందుకు అజ్జు అనే వ్యక్తి సయ్యద్ రిజ్వాన్ అనే యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో యువకుడి తలకు బలమైన గాయం కావడంతో అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటన సులేమాన్‌నగర్ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్థానికంగా యువత గంజాయి మత్తులో పడి చెడు మార్గంలో పయనిస్తున్నారని, వారిని ఈ వ్యసనం నుండి కాపాడాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఈ దాడిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Tags:

Advertisement

Latest News

ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు
మిస్ వరల్డ్  పోటీ పడుతున్న పలువురు సుందరీమణులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పర్యటనలో భాగంగా,...
నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు ఇవే
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ధనుంజయరెడ్డి..కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
సైబరాబాద్ లో రోడ్ సేఫ్టీ.. ఆర్ధిక భద్రతపై అవగాహన ర్యాలీ
సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక
మూడు కేసుల్లో 3.455 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు