సైబరాబాద్ లో రోడ్ సేఫ్టీ.. ఆర్ధిక భద్రతపై అవగాహన ర్యాలీ

By Ravi
On
సైబరాబాద్ లో రోడ్ సేఫ్టీ.. ఆర్ధిక భద్రతపై అవగాహన ర్యాలీ

2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్ కార్యక్రమం లక్ష్యంగా మరియు ఆర్థిక భద్రత కల్పించడంలో 20 సంవత్సరాల సేవను పురస్కరించుకుని, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నానక్‌రంగూడ ట్రాఫిక్ జంక్షన్ వద్ద రోడ్ సేఫ్టీ మరియు ఆర్థిక భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) మరియు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉచిత హెల్మెట్లు పంపిణీ చేసి, హెల్మెట్ ధరించాలన్న అలవాటు పెంపొందించడంలో వారిని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ MD & CEO  క్యాస్పరస్ J.H. క్రామ్‌హౌట్, ట్రాఫిక్ ACP మాధాపూర్ డివిజన్ సత్యనారాయణ, SCSC CEO నవేడ్ ఆలం ఖాన్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ CIO అజిత్ బెనర్జీ, స్ట్రాటజిక్ అడ్వైజర్ రవికుమార్, మల్టీ ప్రోడక్ట్స్ హెడ్  సునీత సాంబరాజు, లీడ్ ఇన్సూరర్ ప్రాజెక్ట్ AGM జాన్ కే. మనోజ్, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సురేష్, మహిళల భద్రత మరియు ట్రాఫిక్ విభాగానికి చెందిన లలిత తిమ్స్ మరియు కేశవ్ భండారి, SCSC ట్రాఫిక్ వాలంటీర్లు పాల్గొన్నారు.IMG-20250516-WA0166

Tags:

Advertisement

Latest News

ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు
మిస్ వరల్డ్  పోటీ పడుతున్న పలువురు సుందరీమణులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పర్యటనలో భాగంగా,...
నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు ఇవే
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ధనుంజయరెడ్డి..కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
సైబరాబాద్ లో రోడ్ సేఫ్టీ.. ఆర్ధిక భద్రతపై అవగాహన ర్యాలీ
సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక
మూడు కేసుల్లో 3.455 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు