సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు దేపా భాస్కర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అనేక నిధులను సమకూర్చి అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. దేపా భాస్కర్ రెడ్డి తెలియని విషయాలపై బురద జల్లే ప్రయత్నం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డిని రాజీనామా చేయమని కాదు.. అనేక హామీలు ఇచ్చి పరిపాలనలో ఫెయిల్ అయిన సీఎం రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి మాట్లాడాలని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ, భీమిలి జంగారెడ్డి, డిపాల్లాల్ చౌహన్, సాజిత్, రామ్ నరసింహ గౌడ్, సామ సుదర్శన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బుర్ర మాధవరెడ్డి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.