హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు
By Ravi
On
టాలీవుడ్ సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాంగ్ రూట్ లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసుపై దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో కార్ తో దూసుకు వచ్చాడు. ఈ గమనించి అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తో ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లినందుకు ప్రయత్నించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. మరోపక్కన ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్ లో వచ్చిన ఆయనకు భారీగా జరిమానా విధించారు.
Tags:
Latest News
15 May 2025 22:00:00
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శెట్టికుంటలో గురువారం మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. శెట్టికుంటలో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు ఉన్న కేవలం సామాన్యులపై...