పాస్ పోర్ట్.. గల్ఫ్ వీసాలు ట్యాంపరింగ్ చేసే ముఠా అరెస్ట్
ఆర్డీజీఐఏ పోలీసులు పాస్‌పోర్ట్‌లు, గల్ఫ్ వీసాలను ట్యాంపరింగ్ చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి 14 పాస్‌పోర్ట్ లు, 14 పీసీసీలు, 14 జీసీసీలు మరియు ఇతర సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీజీఐఏ పోలీసులు షంషాబాద్ జోన్‌కి చెందిన ఎస్‌ఓటీతో కలిసి హైదరాబాదు నాంపల్లిలో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వీరు పాస్‌పోర్ట్‌లు, వీసాలు చెక్కుచెదరకుండా మారుస్తూ, ఈసీఆర్ పాస్‌పోర్ట్‌దారులను వలస నియమాలను ఉల్లంఘించేటట్లు ప్రోత్సహిస్తూ, నిరుపేదులను గల్ఫ్ దేశాలకు POE (Protect of Emigrant) సర్టిఫికెట్లు మరియు వర్క్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ లేకుండా అక్రమంగా పంపిస్తున్నారు. వీరిపై FIR: 439/2025, సెక్షన్లు: 318(4), 336(3), 340(2), 112 BNS మరియు 12 (1)(a)(b) పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం, ఆర్డీజీఐఏ పోలీస్ స్టేషన్ కేసులు నమోదు చేశారు.
2025 మే 13న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వెంకట రమణమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాలాజీ శివ కుమార్ అతని సహచరులు తమను కువైట్‌కి టూరిస్ట్ వీసాలతో అక్రమంగా పంపించేందుకు ప్రయత్నించారని. తనతో సహా మరో 7 మహిళల పాస్‌పోర్ట్‌లు ఈసీఆర్ కేటగిరీలో ఉన్నప్పటికీ, చట్టబద్ధమైన ప్రయాణమని నమ్మబలికారు. హైదరాబాదు RGI విమానాశ్రయంలో ఆమె పాస్‌పోర్ట్‌లో ఉన్న కువైట్ వీసా “CANCELLED” అయినట్లు తెలుసుకున్నారు. బాధితురాలు ఈ నకిలీ వలస మోసాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులు చిలుకూరి బాలాజీ, సుంకర శివ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు