ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి కోపం వచ్చింది

By Ravi
On
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి కోపం వచ్చింది

ఆర్టీసీ ఎండి, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ సీరియస్ అయ్యారు. తన ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేసి మండిపడ్డారు. సోషల్ మీడియా, రీల్స్ లో పాపులర్ కావడానికి ఇలాంటి వెర్రి వేషాలు వేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ యువకుడు ఆర్టీసీ బస్ వద్దకు వచ్చి బస్ గుంటూరు వెళుతుందా అని అడిగితే పోదని కండక్టర్ సమాధానం చెప్పడంతో కాలికి ఉన్న చెప్పు తీసి ఫోన్ తరహాలో అరె ఇది గుంటూరు పోదు అట అంటూ వేషాలు వేయడం అక్కడ ఉన్నవారిని విస్మయానికి గురి చేస్తే.. ఆర్టీసీ యాజమాన్యానికి మాత్రం పట్టరాని కోపం వచ్చింది. దీనిపై సీరియస్ అయిన సజ్జనార్ ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ ఆస్తులు కానీ తమ సిబ్బందిపై వెర్రి వేషాలు వేస్తే యాజమాన్యం సహించదని చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ యువకుడి చేష్టలపై దుమ్మెత్తిపోస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు అందించారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఇప్పటికే కేసు నమోదు చేశారు. వ్యక్తిగతంగా విచారణకు...
గాలిజనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ
బార్ల దరఖాస్తులు ఇలా అప్లై చేసుకోండి
పాస్ పోర్ట్.. గల్ఫ్ వీసాలు ట్యాంపరింగ్ చేసే ముఠా అరెస్ట్
ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి కోపం వచ్చింది
సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు