కాచిగూడ చోరీ కేసులో నిందితుల ఫోటోలు విడుదల..!

By Ravi
On
కాచిగూడ చోరీ కేసులో నిందితుల ఫోటోలు విడుదల..!

హైదరాబాద్‌ కాచిగూడ చోరీ కేసులో నిందితుల ఫోటోలను ఈస్ట్‌జోన్ పోలీసులు విడుదల చేశారు. మొత్తం నలుగురు కరుడుగట్టిన నేపాలీ నిందితులపై లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు. లోకేంద్ర బహదూర్ షాహి, అర్పిత, దీపేందర్ అలియాస్ గజేందర్, చతుర్భుజ్ అలియాస్ ఆర్యన్ నిందితుల ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. వీరితోపాటు మరో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఉన్నట్లు తెలిపారు. వీళ్లని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏప్రిల్ 21న కేజీ బంగారంతోపాటు 50 లక్షల రూపాయల నగదుతో నిందితులు పరారయ్యారు. నిందితులపై తెలంగాణ, మహారాష్ట్ర, నేపాల్‌లో పలు కేసులు ఉన్నాయి. పోలీసుల కంట పడకుండా ఈ నేపాలీ గ్యాంగ్‌ తప్పించుకు తిరుగుతోంది. మొబైల్ ఫోన్లను వాడకుండా నిందితులు తెలివిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పలు ఇళ్లల్లో పనులు చేసేందుకు చేరి.. ఈ నేపాలీ గ్యాంగ్‌ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

Latest News