ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం

By Ravi
On
ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్ సి. హరి కిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కొత్త డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం చేపట్టిన ఎన్‌పీడీఎస్‌ స్పెషల్‌ డ్రైవ్‌ మంచి ఫలితాలను ఇచ్చాయి. వారం రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌,  ఎస్టిఎఫ్ , డిటిఎఫ్ టీమ్‌లు ప్రత్యేక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో రూ.3 కోట్ల మేర గంజాయి, హషిష్ అయిల్‌, ఆల్పోజోలం, నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ పట్టుకున్నారు.
ఎన్‌పీడీఎస్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ఈ నెల 8 నుంచి 14 వరకు నిర్వహించారు. ఇదే తీరు దాడులు కొనసాగిస్తూ గంజాయి, నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ను పట్టుకుంటున్నారు.
జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాల ప్రాంతంలో ఎక్కువగా నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, మెదక్‌ ప్రాంతంలో ఆల్పోజోలం పట్టుకున్నారు. అలాగే కొత్తగూడం, వరంగల్‌ అర్భన్‌, మహబూబాబాద్‌ , ఖమ్మం, శంషాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ హైదరాబాద్‌ ప్రాంతాల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మెదక్‌లో హషీష్‌ అయిల్‌, సంగారెడ్డి, షాద్‌నగర్‌, మేడ్చల్‌ ప్రాంతాల్లో  ఆల్పోజోలం పట్టు కున్నారు. ఎన్‌పీడీ ఎస్ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా వారంలో రోజుల్లో 93 కేసుల నమోదు, 135 మంది నిందితుల అరెస్టు, 44 వాహనాల సీజ్‌ చేశారు. 557 కేజీల  గంజాయి, 313 గ్రాముల హషీష్ ఆయిల్‌, 831 గ్రాముల ఆల్పోజోలంను స్వాధీనం చేసుకున్నారు. 
పట్టుకున్న గంజాయి, హషీష్‌ అయిల్‌, ఆల్పోజోలం విలువ రూ. 3 కోట్ల మేర ఉంటుందాని అంచనా.
ప్రధానంగా జీహెచ్‌ఎంసీ,, శంషాబాద్‌, సూరూర్‌నగర్‌, సికింద్రాబాద్‌,  వికారాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌ కర్నూర్‌, నిర్మల్‌, మంచిర్యాల, అదిలాబాద్‌  జిల్లాలో నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ దాడుల్లో ఎక్కువగా సరూర్‌నగర్‌,  శంషాబాద్‌ ఎక్కువగా ఎన్‌డీపీఎల్‌ మద్యం పట్టు పడింది.
711.6 లీటర్ల మద్యం అంటే సుమారు 948 మద్యం బాటిళ్లను ఈ దాడుల్లో పట్టుకున్నారు. 55 కేసులు నమోదు చేసి 37 మందిని అరెస్ట్‌ చేశారు. పట్టుకున్న నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ విలువ రూ.25  లక్షల మేర ఉంటుందని అంచనా. 
బాగా పని చేశారు.. 
ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫొ ర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్ ఖాసీం సిబ్బంది అభినందించారు. ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని,  జీహెచ్‌ఎంసీ తో పాటు ఇతర జిల్లాలో గంజాయి, డ్రగ్స్‌ను పూర్తి అరికట్టాలని ప్రభుత్వం భావిస్తుందని, ఈ మేరకు ఎన్‌పీడీఎస్‌పై  స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టామన్నారు. అందరు బాగా పని చేశారు. ఇదే తీరు దాడులను నిత్యం  కొనస్తామని చెప్పారు.IMG-20250515-WA0106

Tags:

Advertisement

Latest News