చీటింగ్ కేసులో ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావు అరెస్ట్

By Ravi
On
చీటింగ్ కేసులో ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావు అరెస్ట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడి శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చీటింగ్‌ కేసులో ఆయనపై అభియోగాలు రావడంతోకేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారించేందుకు నోటీసులు ఆయనకు అందజేశారు. కాగా మంగళవారం సీసీఎస్ పోలీసుల ఎదుట శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ అనంతరం శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. గతంలో అఖండ ఎంటర్ ప్రైజస్ సంస్థను రూ. 6 కోట్ల మేర మోసం చేసినట్లు శ్రవణ్‌ రావుపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులోని న్యాయమూర్తి ఎదుట అతడిని హాజరుపరిచాలని నిర్ణయించారు. అందుకోసం అతడిని న్యాయమూర్తి ఇంటికి తరలించారు.

 

Tags:

Advertisement

Latest News

పిల్లర్ నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి పిల్లర్ నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ఉప్పల్ భగాయత్ లో కలకలం రేగింది. నిన్న అదృశ్యమైన ఇద్దరు పిల్లలు భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతి చెందారు. సుజాత, వెంకటేష్...
సీబీఐ కోర్టులో గాలిజనార్ధన్ రెడ్డి పిటిషన్
అసత్య ఆరోపణలు చేస్తే సహించం.. రాష్ట్ర కురుమ సంఘం
మన అంతర్గత శత్రువును ఓడించండి.. ఎక్స్ లో సీనియర్ ఐపీఎస్ రమేష్ మస్తిపురం పిలుపు
త్వరలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం
బెన్నాటో కాల్ హెర్బల్ పౌడర్ వాడుతున్నారా.. అయితే మీకిడ్నీలు పాడైనట్లే..
అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..