బెన్నాటో కాల్ హెర్బల్ పౌడర్ వాడుతున్నారా.. అయితే మీకిడ్నీలు పాడైనట్లే..

By Ravi
On
బెన్నాటో కాల్ హెర్బల్ పౌడర్ వాడుతున్నారా.. అయితే మీకిడ్నీలు పాడైనట్లే..

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలం, గోదావరిఖని ప్రాంతంలో ఒక మెడికల్ స్టోర్‌ పై దాడి చేశారు. మార్కెట్లో విక్రయానికి ఉన్న ఆయుర్వేద ఔషధమైన ‘బెన్నాటో కాల్ హెర్బల్ పౌడర్’ ని తనిఖీ చేసి, ఇది ‘కిడ్నీ స్టోన్స్’కు చికిత్స చేస్తుంది అని తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసి విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు.  షాప్ యజమానిపై కేసు నమోదు చేశారు. దీన్నీ తయారు చేసిన కంపెనీ యజమానుల కోసం గాలిస్తున్నారు. షాప్ లో పెద్ద ఎత్తున నకిలీ ఔషధాలు స్వాదీనం చేసుకున్నారు.
పి. శ్రవణ్ కుమార్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, పెద్దపల్లి. ఎం. శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్, కరీంనగర్ పర్యవేక్షణలో దాడులు నిర్వహించారు. ఈ ఔషధం వల్ల ఎలాంటి కిడ్నీ సమస్యలు దూరం కావని, వాడటం వల్ల ఇతర సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎలాంటి ఔషధాలు అయిన ల్యాబ్ లో పరీక్ష చేసిన తరువాత సర్టిఫికెట్ ప్రకారం విక్రయించాలని అన్నారు. ప్రజలు ఈ విషయం గమనించాలని, ప్రకటనలు చూసి మోసపోవద్దని చెప్పారు. ఏవైనా అనుమానాస్పదంగా తయారవుతున్న ఔషధాలు, నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించి నివాస, వాణిజ్య లేదా పరిశ్రమల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, మరియు ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులను క్రింది టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయవచ్చునని డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.
డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ – టోల్ ఫ్రీ నంబర్: 1800-599-6969, ఇది ప్రతి కార్యాలయ పని దినాలలో ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 5:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

Tags:

Advertisement

Latest News

పిల్లర్ నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి పిల్లర్ నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ఉప్పల్ భగాయత్ లో కలకలం రేగింది. నిన్న అదృశ్యమైన ఇద్దరు పిల్లలు భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతి చెందారు. సుజాత, వెంకటేష్...
సీబీఐ కోర్టులో గాలిజనార్ధన్ రెడ్డి పిటిషన్
అసత్య ఆరోపణలు చేస్తే సహించం.. రాష్ట్ర కురుమ సంఘం
మన అంతర్గత శత్రువును ఓడించండి.. ఎక్స్ లో సీనియర్ ఐపీఎస్ రమేష్ మస్తిపురం పిలుపు
త్వరలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం
బెన్నాటో కాల్ హెర్బల్ పౌడర్ వాడుతున్నారా.. అయితే మీకిడ్నీలు పాడైనట్లే..
అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..