సిటీ పోలీస్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో కొత్త నిర్ణయాలు

By Ravi
On
సిటీ పోలీస్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో కొత్త నిర్ణయాలు

హైదరాబాదు సిటీ పోలీసు కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో తీసుకున్న కొత్త నిర్ణయాలు వాటి వివరాలను సివి ఆనంద్ ఐపిఎస్ డిజి కమిషనర్ అఫ్ పోలీస్ వివరించారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ ను  35 సంవత్సరాల తర్వాత జి.ఓ.ఎం.ఎస్. నెం. 32, (హోం లీగల్ డిపార్ట్‌మెంట్) ద్వారా తేది 30.04.2023 నాడు పోలీసు పునః వ్యవస్థీకరణ చేయడానికి ఉత్తర్వులు ఇచ్చారు.  ఈ జి.ఓ. ప్రాకారము  2 అదనపు లా అండ్ ఆర్డర్ జోన్‌లు - సౌత్ ఈస్ట్ + సౌత్ వెస్ట్, 11 కొత్త లా అండ్ ఆర్డర్ డివిజన్‌లు, 1 అదనపు ట్రాఫిక్ జోన్ (ట్రాఫిక్ 3), మరో 11 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లు (మొత్తం 71), మరో 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లు (మొత్తం 31) ఏర్పాటు చేసి నారు. మరియు నగరంలో ఉన్న  7 జోన్‌లకు 7 మహిళా పోలీస్ స్టేషన్‌లతో మహిళా భద్రతా విభాగం, ప్రత్యేక సైబర్ క్రైమ్ యూనిట్, ఐటీ వింగ్, నార్కోటిక్స్ వింగ్ ఏర్పాటు చేశారు. ఈ మార్పుల కోసం అదనంగా 1200 మంది సిబ్బందిని మంజూరు చేయడం జరిగిందని సీపీ వివరించారు. 
గత 2 సంవత్సరాలుగా, పోలీసు స్టేషన్ హద్దులపై, మరియు కొత్త పోలీస్ స్టేషన్‌లకు వెళ్లడంలో ఎదురు అవుతున్న సమస్యలపై ప్రజల నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చాయని,  ట్రాఫిక్  పోలీసులకు మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులకు కొన్ని ప్రాంతాలలో అధికార పరిధిపై గందరగోళం ఉండటం, సైబర్ క్రైమ్ వింగ్‌ను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని  హైదరాబాదు సిటీ అధికారులు అందరితో చర్చించి, ప్రభుత్వానికి తెలియ పరిచారు. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా, మొత్తం హైదారాబాదు సిటీ పోలీసుకు మంజూరైన 17,020 మంది సిబ్బందిని అంతర్గత సర్దుబాటు మరియు పునః కేటాయింపులు మార్పులతో ప్రతి పాదనలు ప్రభుత్వానికి పంపిచారు.  అందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిత పునర్ సర్దుబాటులను జి.ఓ. నెం. 57( హోం లీగల్ డిపార్ట్‌మెంట్) తేది 24.04.2025 ద్వారా ఆమోదించింది.
ఈ మార్పుల వలన  రాబోయే పదేళ్ల వరకు హైదరాబాద్ నగర పోలీసులు బాగా పనిచేయటానికి అనుకూలంగా ఉంటుందని సీపీ తెలిపారు. 
ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులు:
కొత్త లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు హైదరాబాద్ నగర పోలీసు పరిధిలో 72వ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌గా టోలిచౌకి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు -   ఇంతకు ముందు ఉన్న ఫిల్మ్‌నగర్ పిఎస్, మెహదీపట్నం పిఎస్ (పూర్వం హుమాయున్ నగర్ పిఎస్), మరియు గోల్కొండ పిఎస్ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలను ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు.
స్థానిక ప్రజలు తొందరగా గుర్తు పట్టడానికి వారికి  అనువుగా 1 లా అండ్ ఆర్డర్ డివిజన్ పేరు మరియు 3 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లకు స్థానికంగా  ప్రసిధ్ది చెందిన మరియు స్థానిక సూచనలను ప్రతిబింబించేలా ఈ క్రింద విధంగా పేర్లు మార్చారు.
గోల్కొండ డివిజన్‌ను ఇప్పుడు టోలిచౌకి డివిజన్‌గాను, సెక్రటేరియట్ పిఎస్‌ను లేక్ పిఎస్‌గా ను,హుమాయున్ నగర్ పిఎస్‌ను మెహదీ పట్నం పిఎస్‌గా ను, షాహినాయత్‌ గంజ్ పిఎస్‌ను గోషామహల్ పిఎస్‌గా పేరు మార్చారు.
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ల పునర్వ్యవస్థీకరణ- 28 లా అండ్ ఆర్డర్ డివిజన్ల ప్రకారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల హద్దులు ఉండాలని (ముందు నుంచి ఉన్న పద్ధతి ప్రకారం) ప్రస్తుతము ఉన్న మారేడ్‌పల్లి, బోయిన్‌పల్లి, నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను తీసేశారు. మరియు ప్రస్తుతము ఉన్న లా ఆండ్ ఆర్డర్  పోలీసు స్టేషన్ల పరిధి ప్రకారము  వాటికి సంబంధించిన ఏరియాల్లో పనిచేయడానికి ట్రాఫిక్ నాంపల్లి పీఎస్, ట్రాఫిక్ అంబర్‌పేట్ పీఎస్, ట్రాఫిక్ లంగర్ హౌస్ పీఎస్, ట్రాఫిక్ బహదూర్‌పుర పీఎస్, ట్రాఫిక్ నల్లకుంట పీఎస్‌ల పేర్లు మార్చి-- ట్రాఫిక్ గాంధీ నగర్ పీఎస్, ట్రాఫిక్ ఉస్మానియా యూనివర్సిటీ పీఎస్, ట్రాఫిక్ కుల్సుంపుర పీఎస్, ట్రాఫిక్ ఛత్రినాకా పీఎస్, ట్రాఫిక్ సైదాబాద్ పీఎస్ లు గా  పేర్లు మార్చబడ్డాయి . 
ప్రత్యేక యూనిట్ల ఏర్పాటు తో  మహిళా భద్రతా వింగ్‌ (WSW)ను బలోపేతం చేయడానికి: యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) - దీనికి 1 ఇన్స్పెక్టర్, 8-సిబ్బంది  మరియు  జువెనైల్ బ్యూరో యూనిట్ కు -  దీనికి 1 ఇన్స్పెక్టర్ తో 7 మంది సిబ్బంది ఉంటారు అని తెలిపారు.
ప్రతి లా అండ్ ఆర్డర్ జోన్‌లో ఒక సైబర్ క్రైమ్ సెల్‌లను ఏర్పాటు - ప్రతి సైబర్ క్రైమ్ సెల్‌ కు 1 సబ్-ఇన్స్పెక్టర్ మరియు 5 పోలీస్ కానిస్టేబుళ్లతో సిబ్బంది ఉంటారు.
ప్రస్తుత మరియు భవిష్యత్ పోలీసింగ్ అవసరాలకు తగిన విధంగా  లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ విభాగాలకు మంజూరైన సిబ్బంది సంఖ్యతో బలోపేతం చేశారు. 
పునర్వ్యవస్థీకరణలో జరిగిన మార్పులు అధికార పరిధి పటాలు, సంప్రదింపు, పోలీసు స్టేషన్ వివరాలు మరియు పోలీస్ స్టేషన్ స్థానాలు త్వరలో హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడతాయని సీపీ ఆనంద్ తెలిపారు.

Advertisement

Latest News

ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్ ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్
ఎక్సైజ్ శాఖలో  కమలాసన్ రెడ్డి దగ్గర పని చేయడం ఎంతో గర్వాంగా ఉందని  కమిషనర్ సి హరికిరణ్ అన్నారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లతో పని చేసే అవకాశం...
నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెర్మల్
మిస్ వరల్డ్ 2025 కార్యక్రమంపై సైబరాబాద్ కమిషనరేట్ లో భద్రతా సమన్వయ సమావేశం
పదో తరగతి ఫలితాల్లో విశ్రా విద్యార్థుల విజయకేతనం..!
సిటీ పోలీస్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో కొత్త నిర్ణయాలు
భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ లకు చుక్కెదురు..!
స్పేస్ లో చేపల పెంపకం..