దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు జరపండి. ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

By Ravi
On
దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు జరపండి. ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ ప్రీమియర్ ఫంక్షన్ హాల్‌లో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 380 చెక్కులు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు.బ్ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఆ హామీలను పూర్తిగా విస్మరించి నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా పేద ప్రజలకు ఆర్థిక భరోసా అందించామని, ఈ కార్యక్రమాల ద్వారా మహిళల జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేశామన్నారు. ఇప్పటికీ ప్రజల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యత అని సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బాలాపూర్ మండల తాసిల్దార్ ఇందిరాదేవి, జల్పల్లి మున్సిపాలిటీ కమిషనర్ మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్లు మాజీ కో ఆప్షన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.IMG-20250513-WA0065

Tags:

Advertisement

Latest News

అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ.. అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...
చీటింగ్ కేసులో ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావు అరెస్ట్
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో భారీ ర్యాలీ
పోటాపోటీగా ఎక్సైజ్ టీమ్ ల దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం
గ్రామపంచాయతీ ఉద్యోగుల సభకు రావాలని మంత్రికి వినతి
నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్