హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొల్లురులో ఉచిత వైద్య శిబిరం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లురు గ్రామంలో హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ జెడ్పి చైర్ పర్సన్, డాక్టర్ తీగల అనిత రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ తీగల అనిత రెడ్డి మాట్లాడుతూ ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా గుండె, కిడ్నీ, లివర్, షుగర్, బిపి, వ్యాధులకు సంబంధిత పరీక్షలు ఉచితంగా నిర్వహించారని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్న వయసులో వివిధ దీర్ఘకాలిక జబ్బుల బారిన పడుతున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మధుమేహం. అయితే, డయాబెటిస్ వచ్చాక షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డయాబెటిస్ అదుపులో లేకపోతే కిడ్నీ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గుండె సమస్యల ముప్పు తగ్గాలంటే ముందుగా డయాబెటిస్ పేషెంట్స్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా కిడ్నీ, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందన్నారు. షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. డయాబెటిస్, కిడ్నీ జబ్బులను ఎదుర్కొనే వారిలో చాలా మంది వారు వేసుకునే మందుల విషయంలో అజాగ్రత్త వహిస్తుంటారు. ఒక్కోసారి మందులు వేసుకోవడం కూడా మరచిపోతుంటారు. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యులు సూచించిన విధంగా మందులు వాడడం చాలా అవసరమన్నారు. షుగర్, కిడ్నీపేషెంట్స్ స్మోకింగ్ అలవాటు ఉంటే వీలైనంత త్వరగా మానుకోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఈ అలవాటు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. కాబట్టి, ధూమపానానికి దూరంగా ఉండడం మంచిదన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్, డాక్టర్ తీగల అనిత రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.*