పహల్గామ్ దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన టీఆర్‌ఎస్ నేతలు
మహేశ్వరం నియోజకవర్గంలోని మిర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అరకల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో, కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన అమానుష ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ టీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ దాడిలో 25 మంది అమాయక పర్యాటకులు ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ప్రజాస్వామ్య విలువలకు మచ్చతగిలించిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరులైన వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ — దేశ భద్రతకు భంగం కలిగించే ఇటువంటి అఘాయిత్యాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులను గట్టిగా శిక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కల భూపాల్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, శీను నాయక్, దీప్లాల్ చౌహాన్, సునీత బాలరాజ్, విజయలక్ష్మి, రజాక్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బాలరాజ్, యాదిరెడ్డి, సిద్దాల బీరప్ప, మదారి రమేష్, యాదగిరి, చారి, మోహన్, అర్జున్, జంగయ్య, సుదర్శన్, సురవిలత శేఖర్ గౌడ్, సింగం రాజు, సాలయ్య, సాయి హాథిరాం, పవన్, జగాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.