బోయిన్‌పల్లి బాపూజీ నగర్‌లో అగ్నిప్రమాదం
By Ravi
On
సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి బాపూజీ నగర్‌లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. పోచమ్మ గుడి సమీపంలో ఉన్న కట్టెల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, రెండు ఫైర్ టెండర్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణం గాను దీపం నుండి మంటలు అంటుకోవడమేనని కొందరు నివేదించారు.
Related Posts
Latest News
07 May 2025 19:22:00
కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ అమలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో అత్యవసర సమావేశము నిర్వహించారు. సమావేశము అనంతరము సీపీ సి.వి. ఆనంద్...