పాతబస్తీలో చిన్నారుల అక్రమ రవాణా.. 5గురు అరెస్టు

By Ravi
On
పాతబస్తీలో చిన్నారుల అక్రమ రవాణా.. 5గురు అరెస్టు

హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చిన్నారుల అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ముఠా కలకలం రేపింది. ఏప్రిల్ 20న గాంధీ విగ్రహం సమీపంలో ఐదేళ్ల బాలిక మరియం సాది కిడ్నాప్‌కి గురైంది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు, సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించి ఓ ఇంటిపై దాడి చేశారు.దంపతులు జావీద్ పాషా (51), షాయిస్థా పర్వీన్ (40) లను అరెస్ట్ చేయగా, వారు బాలికను పర్వీన్ భాను అనే మహిళకు రూ.1.30 లక్షలకీ అమ్మినట్టు వెల్లడించారు. వెంటనే పోలీసులు ఉప్పల్‌లో బాలికను రక్షించారు. ఆ సమయంలో సునీత కుమారి మరియు కప్పల రాజేంద్ర ప్రసాద్ కు బాలికను మరలా విక్రయించే ప్రయత్నం జరుగుతున్న సమయంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.ఇతర వివరాల ప్రకారం, రాజేంద్ర ప్రసాద్ జీడిమెట్లలో నివసించే కార్మికుడు కాగా, సునీత ఉప్పల్‌లో ఒక చిన్న ఫస్ట్‌ ఎయిడ్ క్లినిక్ నడుపుతోంది. వీరిద్దరిపై ఇప్పటికే ముంబయిలో విక్రోలి పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఈ గ్యాంగ్ పిల్లల అక్రమ రవాణా కోసం వ్యవస్థాబద్ధంగా పని చేస్తూ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీజ్ చేసిన వస్తువులు:

  • ఓన్డా యాక్టివా బైక్ (TS 07 EC 2745)

  • ఆటో రిక్షా (TS 11 UC 3481)

  • ఆల్టో కారు (AP 11 Q 8917)

  • 5 మొబైల్ ఫోన్లు

  • ₹76,000 నగదు

 

Advertisement

Latest News

15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా 15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మేడ్చ‌ల్  జిల్లా: కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల‌రామారం విలేజ్‌లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. స‌ర్వే నంబ‌రు 354లో ఉన్న ప్ర‌భుత్వ భూమిలో క‌బ్జాల‌ను...
మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా