పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు సమీపంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించబడిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం వద్ద నేడు స్వామివారి 332వ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. స్వామివారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం వీర బ్రహ్మంగారి కమిటీ చైర్మన్ పసునూరి బిక్షపతి చారి. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి , శీను నాయక్, భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్ సిద్దాల భారత్, వీర రాఘవరెడ్డి , విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు రాగి ఫణి అశోక్ చారి, రాపల్లి కృష్ణమాచారి, ఫిరంగి స్వర్ణ చారి, ఈశ్వరోజు వేణు చారి వల్లోజు బ్రహ్మచారి, దయానంద చారి తదితరులు పాల్గొన్నారు.