జీడిమెట్లలో ఘరానా దొంగ అరెస్ట్ – రూ.11.5 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

By Ravi
On
జీడిమెట్లలో ఘరానా దొంగ అరెస్ట్ – రూ.11.5 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్ పరిధిలో భారీ గృహ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. విలేఖరుల సమావేశంలో జీడిమెట్ల సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు వేణు కుమార్‌ను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుంచి రూ.11.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సంపత్ సాయు పరారీలో ఉన్నాడు.

నిందితుడు వేణు కుమార్ ఇప్పటికే సైబరాబాద్ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 44 గృహ చోరీల కేసుల్లో పాలుపంచుకున్నట్టు గుర్తించారు. పాక్సో చట్టం మరియు NDPS చట్టం కేసుల్లోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయి. గతంలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా అనుభవించాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

Advertisement

Latest News

హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డితెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో గురువారం...
ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు