జైహింద్ అంటూ ఎక్స్ లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోస్ట్
By Ravi
On
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత రక్షణ దళాలు దాడులు నిర్వహించాయన్న వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు సైతం ఈ చర్యను స్వాగతిస్తూ, భారత సత్తాను చాటారని ప్రశంసించారు.ఈ దాడులను పహల్గామ్ ఉగ్రదాడికి సరైన ప్రతీకారమని అభిప్రాయపడ్డారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ దాడులను స్వాగతిస్తూ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "పాకిస్థాన్‌లోని ఉగ్రవాద రహస్య స్థావరాలపై మన రక్షణ దళాలు జరిపిన లక్షిత దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరో పహల్గామ్ వంటి ఘటన పునరావృతం కాకుండా పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పాలి. పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలి," అని ఒవైసీ పేర్కొన్నారు. తన పోస్ట్‌ను ఆయన 'జై హింద్' నినాదంతో ముగించారు.
Tags:
Latest News
10 May 2025 22:33:32
పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్- చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్..!- యుద్ధంతో చావుదెబ్బ తిన్న దాయాది- రెండురోజుల్లోనే చేతులెత్తేసిన పాక్- లాహోర్‌లో పాక్ రాడార్ వ్యవస్థ...