చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం

By Ravi
On
చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం

కూకట్‌పల్లి TPN :
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధిపై హైడ్రా మరియు జీహెచ్ఎంసి అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఐదు చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. అందులో రెండు చెరువులను హైడ్రా, మిగిలిన మూడు చెరువులను జీహెచ్ఎంసి అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు.

నల్లచెరువు వద్ద సుమారు 30 ఎకరాల ప్రైవేట్ భూమి ఉండగా, పట్టాదారులకు టిడిఆర్‌లు (ట్రాన్సఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్‌) ద్వారా న్యాయం చేస్తే వారు అభివృద్ధికి అడ్డుకాదని తెలిపారు. ప్రజలను ఒప్పించేందుకు తానే ముందుంటానన్నారు. ఇప్పటికే పలువురు భూస్వాములతో చర్చలు జరుపుతున్నామని, అన్ని చెరువుల అభివృద్ధికి టిడిఆర్‌లు మంజూరు చేస్తే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత ఉండదని అన్నారు.

Advertisement

Latest News

15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా 15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మేడ్చ‌ల్  జిల్లా: కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల‌రామారం విలేజ్‌లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. స‌ర్వే నంబ‌రు 354లో ఉన్న ప్ర‌భుత్వ భూమిలో క‌బ్జాల‌ను...
మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా