ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
సరూర్‌నగర్ మన్సూరాబాద్ లో అక్షయ్ కుమార్(30) తన ఇంట్లో చిన్న సైజ్ వైన్ షాప్ ఓపెన్ చేశాడు. పలు రాష్ట్రాల నుండి నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ తెచ్చి అమ్మకాలు సాగిస్తున్నాడనే సమాచారం మేరకు రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్‌తోపాటు ఎన్‌ఫొర్స్‌మెంట్ సీఐ బాలరాజు, ఎస్సై రవితోపాటు సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అక్షయ్ కుమార్ ఇంట్లో 45 నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనచేసుకున్నారు. 23 గోవాకు చెందిన మద్యం బాటిళ్లు, ఢిల్లీ,హర్యానాకు చెందిన 8 బాటిళ్లు, 9 డ్యూటి ఫ్రీ బాటిళ్లు , 5 తెలంగాణకు చెందిన బాటిళ్లు, ఒకటి పంజాబ్‌కు చెందిన బాటిల్ ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం బాటిళ్ల విలువ రూ. 1.20 లక్షల మేరకు ఉంటుందని ఏఈఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. ఏడాదిగా ఫోటోగ్రఫీ పేరుతో పలు ప్రాంతాలకు వెళ్లి వస్తూ వస్తూ మద్యం బాటిళ్లను తీసుకు వచ్చి హైదరాబాద్‌లో అమ్మకాలు సాగిస్తున్నట్లు విచారణ వెల్లడయ్యింది. మద్యం బాటిళ్లను పట్టుకున్న రంగారెడ్డి ఎన్‌ఫొర్స్‌మెంట్ టీమ్‌ను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అండ్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, రంగారెడ్డి డిప్యూటి కమిషనర్ పి.దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్‌లు అభినందించారు.