సిటీలో పలుచోట్ల ఎక్సైజ్ ఎస్టిఎఫ్ డి టీమ్స్ దాడులు.. 5.260కేజీల గంజాయి స్వాధీనం
ఎక్సైజ్ అధికారులు రెండు కేసుల్లో 5.260 కేజీల గంజాయి స్వాదీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడమే కాకుండా కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ డిటిఎఫ్, ఎస్టిఎఫ్డి టీమ్‌ల ఎక్సైజ్ సిబ్బంది నిర్మల్ ప్రాంతానికి చెందిన మలావత్ రాజేందర్, ఇండాల్ రాథోడ్‌లు కలిసి 4.140 కేజీల గంజాయిని కారులో తీసుకొని వచ్చి హైదారాబాద్ లో అమ్మకాలు చేయడానికి ప్రయత్నం చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ శివారు ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో కొందరు వ్యక్తులకు అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంతున్నట్లు దర్యాప్తులో తేలింది.
మరో కేసులో..
కొండాపూర్ బొటానికిల్ పార్కు సమీపంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టి ఎఫ్డీ టీమ్ ఎస్సై జ్యోతి టీం దాడి నిర్వహించారు.
ఈ కేసులో వెస్టు బెంగాల్‌కు చెందిన నారాయణ చౌదారి అనే వ్యక్తి అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఒక సెల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయితోపాటు నిందితుడిని షేర్ లింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. గంజాయిని పట్టుకున్న కేసులో ఎస్సై జోతితోపాటు హెడ్‌కానిస్టేబుల్ లేఖా సింగ్, కానిస్టేబుళ్లు రాజేశ్వర్, చంద్రశేఖర్,కాశీరావు, శశిలు ఉన్నారు.