ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్

By Ravi
On
ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్

హార్వర్డ్‌ యూనివర్సిటీ విషయంలో ట్రంప్‌ టీమ్ అన్నంత పని చేసింది. ఆ విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్‌ నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌ మాన్‌ అనౌన్స్ చేశారు. యూనివర్సిటీపై కంట్రోల్ ను ఎక్స్ పెక్ట్ చేస్తూ కొన్ని మార్పులు తీసుకురావాలని యూనివర్సిటీ సూచించినా.. దానికి ట్రంప్ టీమ్ వ్యతిరేకించడంతో యూనివర్సిటీ బడ్జెట్.. పన్ను మినహాయింపుల్లో కోతలు విధిస్తున్నట్లు తెలిపారు. గవర్నమెంట్ డిమాండ్స్ ను నెరవేర్చే వరకు హార్వర్డ్ కు ఎలాంటి కొత్త గ్రాంట్స్ మంజూరు చేసే ప్రశక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. 

ఫెడరల్ పరిశోధన గ్రాంట్లకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని.. యూనివర్సిటీ ట్యూషన్‌ ఫీజులను చెల్లించడానికి విద్యార్థులకు సహాయపడే ఫెడరల్ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యాశాఖ పేర్కొంది. కొత్త గ్రాంట్లకు అర్హత పొందడానికి హార్వర్డ్‌.. ఫెడరల్‌ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి ఉంటుందని మెక్‌ మాన్‌ తెలిపారు. అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న విదేశీ విద్యార్థులకు హార్వర్డ్‌లో ప్రవేశం కల్పిస్తూ.. దేశ అత్యున్నత విద్యావ్యవస్థను అపహాస్యం చేసిందని ఆరోపించారు.

Advertisement

Latest News

మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు.  మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో...
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా
అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం